జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు…

జేఎన్‌యూ హింసాత్మక ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ స్పందించింది. దిల్లీ పోలీసులకు, జేఎన్‌యూ రిజిస్ట్రార్‌కు డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ నోటీసులు జారీ చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ తాలూకు వివరాల్ని తమకు అందజేయాలని కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, సీసీటీవీ ఫుటేజీ, పోలీసులు స్పందించకపోవడానికి గల కారణాలతో నివేదికను అందజేయాలని డీసీడబ్ల్యూ నోటీసులో పేర్కొంది. అంబులెన్సులను, మీడియా ప్రతినిధులను క్యాంపస్ లోపలికి అనుమతించకపోవడానికి గల కారణాలేంటని ప్రశ్నించింది. బుధవారం అన్ని ఫిర్యాదుల కాపీలతో వర్సిటీ రిజిస్ట్రార్‌, పోలీసులు తమ ముందు హాజరు కావాలని సూచించింది.