బుట్ట‌బొమ్మ వీడియో సాంగ్ ప్రోమో విడుదల…

త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం అల‌.. వైకుంఠ‌పురములో. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. థ‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన సాంగ్స్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇందులోని బుట్ట‌ బొమ్మ సాంగ్ ప్రోమో వీడియో చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో అల్లు అర్జున్, పూజా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ‌న్నీ వేసే స్టెప్స్కు ఫ్యాన్స్‌ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. సాంగ్‌లోని సెట్ కూడా చాలా అందంగా క‌నిపిస్తుంది. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, ఆర్మాన్ మాలిక్ పాట పాడారు.