భారత్‌కు 80మంది బ్రెజిల్ పారిశ్రామికవేత్తలు…

గణతంత్ర వేడుకలకు వస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బాల్సోనారో వెంట 80 మంది పారిశ్రామిక వేత్తలు ఇండియాకు రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు. వారంతా ఈ నెల 27న జరగనున్న పారిశ్రామిక సమావేశంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాలకు ఎంతో కీలకమైనది బ్రెజిల్ రాయబారి అన్నారు. రక్షణ, వ్యవసాయ, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.