ప్రధాని మోదీని కలిసిన బీజేపీ చీఫ్ నడ్డా…

భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడు జగత్ ప్రకాశ్‌ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపిన నడ్డా… విలువైన మోదీ సూచనలతో పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో లక్ష్యాలను సాధిస్తుందని తెలిపారు. కాగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందించిన నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నడ్డా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు.