మరోసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె…!

దేశ వ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగనున్నాయి. జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చారు. మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా సమ్మెను నిర్వహించనున్నట్లు తెలిపింది. అప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు ముందుకు సాగకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తున్నామని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యుఎఫ్‌బీయూ) ప్రకటించింది. కాగా.. వేతన సవరణను యుఎఫ్‌బీయూ కనీసం 15 శాతం పెంపును కోరుతుంది. 12.25 శాతం వేతనాల పెంపు, స్పెషల్‌ అలవెన్స్‌ను బేసిక్‌ పేలో కలపడం, వారానికి ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ ఇచ్చిన ఆఫర్‌పై అంగీకారం కుదరలేదు.