ధోనీపై ఆస్ట్రేలియా కీపర్ క్యారీ ప్రశంసలు…

ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ భారత మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. తాను కూడా ధోనిలా అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్‌ కావాలని ఉందని మనసులోని మాటను వెల్లడించాడు. మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌ చేసే నైపుణ్యం తనలో ఉందన్నాడు. ఆస్ట్రేలియాకు ఒక మంచి ఫినిషర్‌గా మారడం కోసం యత్నిస్తున్నానన్న క్యారీ.. ధోనీ అంతటి ఫినిషర్ కావాలన్నది తన కోరిక అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ధోని అత్యుత్తమ ఫినిషర్‌ అన్న క్యారీ.. ప్రతీ ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకుంటారని అన్నాడు.