ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం :ఆర్మీ చీఫ్

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్ధు చారిత్రాత్మక నిర్ణయం అని ఆర్మీ చీఫ్‌ జనరల్ నరవణే అన్నారు. ఈ నిర్ణయం జమ్ముకశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా భారత్‌తో పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్థాన్‌ భంగపాటుకు గురైందన్నారు. అటు, సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించవన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పేందుకు పలు మార్గాలను అనుసరిస్తామన్నారు. అనంతరం, ప్రతిభ కనబరిచిన జవాన్లకు పతకాలు బహూకరించారు.