శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం…

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకు జగన్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ చేపట్టనుంది. కాగా, బిల్లును సీఎం జగన్ శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏపీ ప్రభుత్వం శాసన మండలి రద్దుకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. గతంలో కేంద్రం, ప్రధాని నుంచి వచ్చిన లేఖల ఆధారంగానే ఏపీ ప్రభుత్వం మండలి రద్దుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ.. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిన తర్వాతే కేబినెట్ ఆమోదం తీసుకున్నట్టు తెలుస్తోంది.