కశ్మీర్‌లో మంచు బీభత్సం.. 8 మంది మృతి!

జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టార్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో జవాను గల్లంతయ్యాడు. గాయపడిన మరో జవాను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. గల్లంతైన జవాను కోసం ఆర్మీ, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రహదారులపై తీవ్రంగా మంచు పేరుకుపోయి ఉండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సిబ్బంది విమానాల ద్వారా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సోన్‌మార్గ్‌ లో సంభవించిన హిమపాతంతో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో తొమ్మిది మందిని భద్రతా బలగాలు సురక్షితంగా రక్షించాయి. లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు హిమపాతం జరిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు.