తూర్పు టర్కీలో భూకంపం, 22 మంది మృతి…

తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. వెయ్యి మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్‌ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్‌ సోయ్‌లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.