మూడో రోజు తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు  వరుసగా మూడు రోజుకూడా తగ్గుముఖం పట్టాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల తగ్గింపుతో ఇవాళ మరో 15 పైసలు  దిగి వచ్చింది. దీంతో ఈ మూడు రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు 44 పైసలు, డీజిల్‌పై లీటరుకు 45 పైసల ధర తగ్గింది.  ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలను లీటరుకు 15 పైసలు తగ్గా, ఢిల్లీ కోల్‌కతాలో డీజిల్ ధరను 16 పైసలు తగ్గింది. ముంబై, చెన్నైలలో లీటరుకు 17 పైసలు తగ్గించడం విశేషం.