బంకర్‌ లో పేకమేడలా కూలిపోయిన నీళ్ల ట్యాంక్‌

పశ్చిమబెంగాల్‌ ఇన్నాళ్లు సేవలందించిన ఓ నీళ్ల ట్యాంక్‌..పేకమేడలా కూలిపోయింది. బంకుర జిల్లాలో నాలుగేళ్ల క్రితం నిర్మించిన క్షణాల్లో పునాదులతో సహా కుప్పకూలింది. 7లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్‌ ట్యాంకర్‌ నుంచి 16గ్రామాలకు మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి.అయితే ఇప్పుడు ట్యాంక్‌ కూలడంతో తాగునీటికి కష్టాలు తప్పవంటున్నారు స్థానికులు. ఇక ఘటనపై విచారణ జరిపి.. వాటర్‌ ట్యాంక్‌ ను పునర్‌ నిర్మిస్తామంటున్నారు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు.