ఫిబ్రవరి 1న కొనసాగనున్న స్టాక్‌ మార్కెట్లు

ఈ సారి బడ్జెట్‌ రోజు కూడా స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఫిబ్రవరి1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1 శనివారంకానుంది. అయితే శనివారం దలాల్‌ స్ట్రీట్‌కు సెలవు. కానీ ఈ సారి శనివారం కూడా స్టాక్‌మార్కెట్లు తెరిచే అవకాశాలున్నాయని స్టాక్‌ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ కూడా ఆ రోజు పనిచేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని ఇప్పటికే కీలకమైన పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతుండటంతో ఈ అంశంపై తీవ్రంగా దృష్టిపెట్టారు.