పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో మంచు తుపాను

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో  31 మంది మరణించారుమంచుదాడికి క్వెట్టా ప్రాంతంలో ఓ భవనం కూలి పోయిన దుర్ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు.మృతుల్లో పిల్లలు, మహిళలున్నారు. ఇటు బలోచిస్థాన్ ప్రాంతంలో మంచు తుపాన్ మరో 14 మందిని బలి తీసుకుందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపింది. భారీగా కురుస్తున్న మంచుతో క్వెట్టా-జియారత్ జాతీయ రహదారిని మూసివేశారు.