పాకిస్థాన్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, 25మంది మృతి

పాకిస్థాన్‌ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్య స్తమైంది. వరదల్లో చిక్కు కొని 25 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఇటు పంజాబ్‌ తూర్పు ప్రాంతంలో, హెల్మండ్‌ ప్రావిన్స్‌ల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.