న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్‌తో ఈ నెల 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కివీస్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో ఆడే ఐదు టీ20ల సిరీస్‌ కోసం 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. కోహ్లీ, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, షమి, నవ్‌దీప్‌ సైని, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకుర్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యారు.