నిర్భయ దోషుల క్యూరేటివ్‌ పిటిషన్లపై విచారణ

కాసేపట్లో నిర్భయ ఇద్దరు దోషుల క్యూరేటివ్‌ పిటిషన్లపై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఛాంబర్‌లో అంతర్గతంగా విచారణ చేపట్టనుంది. నిర్భయ దోషులు వినయ్‌శర్మ, ముకేశ్‌ ఇద్దరూ క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2012 నిర్భయ ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా పటియాల కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. వీరి ఉరితీతకు తీహార్ జైళ్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.