నిర్భయ దోషుల‌తో పాటు ఇందిరా జైసింగ్ ను జైల్ లో పెట్టాలి

బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ కంగ‌నా రౌన‌త్ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. అత్యాచార దోషుల‌కు క్ష‌మాభిక్ష పెట్టాల‌ని ప్ర‌ఖ్యాత లాయ‌ర్ ఇందిరా జైసింగ్ .. నిర్భ‌య త‌ల్లి ఆశాదేవిని కోరిన విష‌యం తెలిసిందే. లాయ‌ర్ జైసింగ్‌ను కూడ నిందితుల‌తో క‌లిపి నాలుగు రోజుల పాటు జైలులో బంధించాల‌ని కంగ‌నా అన్నారు, ఇందిర‌ను వారితో బంధించ‌డం అవ‌స‌రం. అలాంటి మ‌హిళ‌లే ఇలాంటి రాక్ష‌సులు, నేర‌గాళ్ల‌కు జ‌న్మ‌నిస్తార‌ని,న్యాయవాది అయిన ఇందిరా తన స్థాయిని మరిచి మట్లాడారని ఆరోపించింది ఈ డాషింగ్‌ లేడీ. అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఉరే సరి అంటోంది. క్ష‌మాభిక్ష కోరేందుకు నువ్వెవ‌రు అని కంగ‌నా రౌన‌త్ ప్ర‌శ్నించారు.