తమిళనాడులో ఘనంగా పొంగల్‌ వేడుకలు

తమిళనాడులో పొంగల్‌ వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. గ్రామాల్లో పండగ సందడి నెలకొంది, ఇళ్లముందు రంగురంగుల రంగవల్లులు వేసి పొంగలి వండివారుస్తున్నారు. చిన్నాపెద్దా పండుగ వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఇక ఏటా సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు నాలుగువేల మందికి పైగా యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.