చెరుకు ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు…ముగ్గురు మృతి

ఇటిక్యాల మండలం ఎర్రవల్లి దగ్గర రోడ్డుప్రమాదం  జరిగింది. ఆగిఉన్న ఓ చెరుకు ట్రాక్టర్‌ను అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం గద్వాల మండలం, దెయ్యాల వాగు వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతులు గద్వాల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు. కారు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.