గ్లెన్ మెక్‌గ్రాత్‌తో కేటీఆర్‌

దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో ..  హెచ్‌సీఎల్ రిసెప్ష‌న్ వ‌ద్ద మాజీ బౌల‌ర్ మెక్‌గ్రాత్‌ను మంత్రి కేటీఆర్ క‌లిశారు. బిజీ బిజీ షెడ్యూల్ మ‌ధ్య‌.. బుధ‌వారం రోజున కేటీఆర్ త‌నకు ఇష్ట‌మైన బౌల‌ర్‌తోనూ కాసేపు ముచ్చ‌టించారు. దావోస్‌లో మెక్‌గ్రాత్‌ను చూసి కేటీఆర్ సంబ‌ర‌మాశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఆఫ్ స్టంప్‌పై మెషీన్‌లా బంతులు వేసే సంద‌ర్భాన్ని మంత్రి కేటీఆర్‌.. ఆసీస్ బౌల‌ర్‌తో గుర్తుచేశారు. త‌న మాట‌లు విని.. గ్లెన్ త‌న‌ను ఎంతో ఆప్యాయంగా భుజం త‌ట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.