క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి పాత్రలో అనుష్క శర్మ

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిసిగ్నల్‌ ఇచ్చింది. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో ప్రధానపాత్ర పోషించేందుకు అనుష్క ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.  ఝుల‌న్ గోస్వామి భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు  జట్టు విజ‌యాల‌లో చాలా సార్లు కీ రోల్ పోషించింది. 2010లో అర్జున అవార్డ్‌ తో పాటు ప‌ద్మ శ్రీ అవార్డు కూడా ద‌క్కించుకుంది. 2002లో తొలి వ‌న్డే మ్యాచ్ ఆడిన గోస్వామి ఇటీవ‌ల టీ 20ల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది.  అటు భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బ‌యోపిక్ కూడా రూపొందుతున్నది. తాప్సీ కీరోల్‌ పోషిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది.