కోహ్లీపై ప్రశంసలు కురిపించిన స్టీవ్‌ స్మిత్‌

భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మన్‌ స్టీవ్‌ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. తన కంటే కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌ మన్‌ అని కీర్తించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌ మన్‌ జాబితాలో ఎప్పుడూ ముందుంటారు. కోహ్లీ ఒక అద్భుతమని, మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని కోహ్లీని కొనియాడాడు. అయితే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చర్చిస్తుంటారు. అన్ని ఫార్మాట్లలో అదరగొట్టే విరాట్ గొప్ప అని కొందరంటే, టెస్టుల్లో, వన్డేల్లో ఎంతో నిలకడగా రాణించే స్మిత్‌ అని మరికొందరు అంటుంటారు.