400 సిక్సర్ల క్లబ్‌ లో రోహిత్‌ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. 400 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ ఘనత సాధించాడు. అంతర్జాతీయంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌శర్మ మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ ఇప్పటి వరకు 404 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 232 సిక్సర్లు, టెస్టుల్లో 52 సిక్సర్లను బాదిన రోహిత్‌ శర్మ.. టీ20ల్లో 120 సిక్సర్లను సాధించాడు. క్రిస్‌ గేల్ 534 సిక్సర్లతో, షాహిద్‌ అఫ్రీది 476సిక్సర్లతో  తొలి రెండు స్థానంలో ఉన్నారు.