సిటిజెన్‌ షిప్‌ అమెండ్‌ మెంట్‌ బిల్‌ కు వ్యతిరేకంగా ఆందోళనలు

ఓ వైపు పార్లమెంట్‌ సిటిజెన్‌ షిప్‌ అమెండ్‌ మెంట్‌ బిల్‌ ను ఆమోదించుకునేందుకు కేంద్రం పావులు కదుపుతుంటే..మరో వైపు ఈశాన్య రాష్ర్టాల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.  సిఎబి రాజ్యాంగ విరుద్ధమంటూ ఆసోంలొ ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. గౌహతి నేషనల్‌ హైవేలో టైర్లు తగలబెట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసలు తెలిపారు.  ఈ బిల్లు హిందూ-ముస్లింల ఐక్యతను దెబ్బ తీస్తుందంటున్నారు.