వెల్‌డన్‌ తెలంగాణ సీఎం: హర్భజన్‌

దిశ నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ పై భారత వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్‌ సింగ్‌ అభినందించాడు. వెల్‌డన్‌ తెలంగాణ సీఎం, వెల్‌ డన్‌ తెలంగాణ పోలీస్‌. మీరు ఏదైతే చేశారో అది కచ్చితంగా అభినందనీయమేనని హర్భజన్‌ పేర్కొన్నాడు.