ఫైజాబాద్, లక్నో, వరణాసి పేలుళ్లలో యూపీ కోర్టు సంచలన తీర్పు

2007 నాటి ఫైజాబాద్, లక్నో, వరణాసి నగరాల్లో వరుస పేలుళ్ల కేసులో ఉత్తరప్రదేశ్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లు జరిగిన 12ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధించింది. 2007లో ఉగ్రవాదులు ముహమ్మద్ తారిఖ్, ముహమ్మద్ అఖ్తర్ లు పలు నగరాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ కేసులో దోషులకు జీవిత ఖైదుతో పాటు రూ.50వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇక ఈ మూడు పేలుళ్లలో నలుగురు మరణించగా, 26 మంది గాయపడ్డారు.