పథకాల రేసులో భారత్

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల రేసులో దూసుకెళుతున్నది. టోర్నీ నాలుగో రోజు భారత ప్లేయర్లు రెచ్చిపోవడంతో 30 స్వర్ణాలు సహా 53 పతకాలు సాధించారు. దీంతో ఓవరాల్‌గా 124 పతకాలతో భారత్‌ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మహిళల పోటీల్లో శాంతనోయ్‌ దేవి, పూనమ్‌, దీపిక, సుశీల, రోషిబినా దేవిస్వర్ణాలు సాధిస్తే.. పురుషుల విభాగంలో సునీల్‌ సింగ్‌, సూరజ్‌ సింగ్‌ పసిడి పతకాలతో మెరిశారు. స్విమ్మింగ్‌లో మొత్తం 11 పతకాలు వచ్చాయి. పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో లిఖిత్‌ సెల్వరాజ్‌, ప్రేమ స్వర్ణం సాధించగా.. ధనుష్‌ సురేశ్‌ రజతం పట్టాడు. మహిళల 100 మీటర్ల బటర్‌ ఫ్లై విభాగంలో దివ్యా సతిజ, 200 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో అపేక్ష పడిసిని పట్టగా… 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలేలో భారత జట్టు అగ్రస్థానంలో నిలిచింది. అలాగే వెయిట్‌ లిఫ్టింగ్‌లోనూ భారత్‌కు నాలుగు స్వర్ణాలు దక్కాయి. తైక్వాండో ప్లేయర్లు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలతో ఆకట్టుకున్నారు.