దక్షిణాసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట

స్విమ్మర్లు, రెజ్లర్లు అద్భుత ప్రదర్శనతో దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల ఆధిపత్యం మరింత పెరిగింది. పోటీల ఏడో రోజు భారత్‌కు మొత్తం 38 దక్కాయి. టోర్నీలో మొత్తంగా 132 స్వర్ణాలు సహా 252 పతకాలతో భారత్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఏడోరోజు పోటీల్లో భారత స్విమ్మర్లు ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో సత్తా చాటారు. రెజ్లింగ్‌లో నాలుగు పసిడి పతకాలు లభించాయి. జూడోలోనూ భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం దక్కాయి. ఇక టెన్నిస్ పురుషుల, మహిళల, మిక్స్‌డ్ డబుల్ ఫైనల్ పోటీలు భారత ప్లేయర్ల మధ్యే జరుగగా మూడు స్వర్ణాలు, మూడు రజతాలు వచ్చాయి. బాక్సింగ్‌లో భారత్‌కు 15 పతకాలు ఖాయమయ్యాయి. ఇవాళ కబడ్డీ ఫైనల్స్‌ లో భారత పురుషుల జట్టు శ్రీలంకతో, మహిళల జట్టు ఆతిథ్య నేపాల్‌తో తలపడనున్నాయి.