టీమిండియా కెరీర్‌లోనే వాంఖడే టీ20 అద్భుతమైనది

టీమిండియా కెరీర్‌లోనే ముంబైలో జరిగిన టీ20 ఇన్నింగ్స్‌ అత్యుత్తమమైనదిగా.. కెప్టెన్‌ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు ఇదో ప్రత్యేకమైన రోజు అన్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసి విజయం సాధించడం ఎంతో బాగుందన్న కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలమని దీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు  వాంఖడే మ్యాచ్‌.. టీమిండియాకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందన్నాడు.