సూడన్‌ పాపకు హైదరాబాద్‌లో అరుదైన శస్త్ర చికిత్స

హైదరాబాద్‌లో మరో అరుదైన శస్ర్తచికిత్స జరిగింది. సూడన్‌ దేశాన్నికి చెందిన నెల రోజుల పాపకి … రెయిన్‌ బో ఆస్పత్రి వైద్యులు అరుదైన గుండె శ్రస్తచికిత్సను నిర్వహించారు.  దాదాపు 4 గంటల పాటు చికిత్స నిర్వహించి పాపను బ్రతికించారు. ఇండియాన్‌ పీడియాట్రిక్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీలో సంక్లిష్టమైన శస్ర్తచికిత్సగా వైద్యులు చెబుతున్నారు.

ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో చాలా దేశాల వారికి ..  హైదరాబాద్‌  హెల్త్‌ హబ్‌ గా మారుతోంది. ఇతర దేశాల నుంచి మెరుగైన చికిత్స కోసం భాగ్యనగరానికి క్యూకడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. అనుభవజ్ఞాలైన వైద్యులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం లభించడమే ఇందుకు కారణం.

ఇక్కడ కనిపిస్తున్న పాప వయస్సు నెల రోజులు. పుటుకుతోనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గత నెల 26వ తేదిన చికిత్స నిమిత్తం సూడన్‌ నుండి హైదరాబాద్‌ వచ్చారు. గుండె ఎడమ భాగం వృద్ధి చెందలేదని డాక్టర్లు గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని హైపోప్లాస్టిక్‌ లెఫ్ట్ హర్ట్‌  సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు తేల్చారు.

ఇండియాన్‌  పీడియాట్రిక్‌  కార్డియోథొరాసిక్‌  సర్జరీలో ఇదో సంక్లిష్టమైన శస్ర్తచికిత్సగా వైద్యులు చెబుతున్నారు. దాదాపు 4 గంటల పాటు నోర్ప్‌డ్ ప్రక్రియా ద్వారా చికిత్స నిర్వహించి పాపను బ్రతికించారు. దేహంలో రక్తానికి ఆక్సిజన్‌ అందే విధంగా చేయడంలో ఈ ప్రక్రియలో కీలకమైందని, ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని రైన్‌బో వైద్యులు తెలిపారు.

తమ దేశంలో ఈ ట్రీట్‌మెంట్‌ కోసం చాలా చోట్ల తిరిగినా… ఎక్కడ ఈ వ్యాధికి సంబంధించిన వైద్యం అందుబాటులో లేదని పాప తల్లిదండ్రులు చెప్పారు. కొంత మంది సలహా మేరకు హైదరాబాద్‌ వచ్చామన్నారు. ఇక్కడి వైద్యులు అందించిన ట్రీట్‌మెంట్‌ వల్లే తమ పాప బ్రతికిందని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో చాలా దేశాల్లోని పేషెంట్స్  .. ట్రీట్‌ మెంట్‌  కావాలంటే  ముందుగా హైదరబాద్ నే ఆశ్రయిస్తున్నారు. వారందరికీ హైదరాబాద్ వైద్య భరోసానిస్తున్నది. దీంతో.. చికిత్స పూర్తి చేసుకొన్న వారంతా.. థ్యాంక్యూ హైదరాబాద్ అని ధన్యవాదాలు చెబుతున్నారు.