‘వాట్సప్‌ పే’తో భద్రత ఉండకపోవచ్చు!

ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ వాట్సప్‌ తన యూజర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచలేకపోతుంతా అంటే అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా లేవు. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడంలో వాట్సాప్‌ సామర్థ్యంపై నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పారదర్శకతను.. వాట్సాప్‌  పే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు, వాట్సాప్‌  పే లో యూజర్ల ఆర్థిక లావాదేవీల వివరాలకు భద్రత ఉండకపోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌  సైతం భావిస్తోంది.