రాష్ట్రపతి పాలనపై కపిల్ సిబల్ ఆగ్రహం

మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వాలను ముక్కలు చేయడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి మంచిఅనుభవం ఉందన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో  ఎంత సిద్ధహస్తులో గోవా, కర్నాటక రాష్ట్రాల్లో చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం సమయం ఇవ్వడంలోనూ బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీల మధ్య పక్షపాతం చూపించారంటూ కపిల్ సిబల్ మండిపడ్డారు.