మూడూ కీలకమైనవే!

యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్‌ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్‌లపై తీర్పు వెలువరించనున్నారు.  శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ  సుప్రీం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది.  ఇక రాఫెల్‌ యుద్ధవిమానాల రివ్యూ పిటిషన్‌ పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది.  రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.