మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికల్ 356 క్టాజ్ 2 ప్రకారం ఈనెల 12న అమలు చేసిన రాష్ట్రపతి పాలన ఇకపై ఉండబోదని ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఉదయం 5 గంటల 57 నిమిషాలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు.