బ్రెజిల్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటనకు బయల్దేరారు. 11వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ బయలుదేరిన ప్రధాని రేపు నుంచి జరిగే బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ లోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ భేటీ కానున్నారు. కాగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.