ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధాని అభినందనలు

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధికి, మరాఠి ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.