ఎంపీ ప్రజ్ఞాను సజీవ దహనం చేస్తా

భోపాల్‌ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలపై బయోరా ఎమ్మెల్యే గోవర్థన్‌ డంగీ మండిపడ్డారు. ప్రజ్ఞా సింగ్‌ మధ్యప్రదేశ్‌లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తానని హెచ్చరించారు.  అటు డంగీ  వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాధ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.