ఇరాక్​ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకం

ఇరాక్​ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు అత్యంత హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళన చేస్తున్నవారిపై భద్రతా దళాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఐదుగురు నిరసనకారులు కాల్పులలో మరణించగా, బాష్పవాయు గోళాలు తలకు తగిలి మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో వంద మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్ ​లోని వంతెనపై నుంచి నిరసనకారులు ముందుకు రాకుండా దళాలు నిలువరించాయి. టైగ్రిస్ నదిపైనున్న మూడు వంతెనలపైకి చేరుకున్న నిరసనకారులు.. ప్రభుత్వ భవనాలు ఉన్న అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్​లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. బస్రా నగరంలో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ ఇరాక్​లోని పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పదిమంది మృతి తీవ్రంగా గాయలపాలయ్యారు.