సాయంత్రం నేపాల్ వెళ్లనున్న జిన్ పింగ్!

భారత్‌ పర్యటన అనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ నేపాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 23ఏళ్ల తరువాత నేపాల్‌ రానున్న జిన్‌ పింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నేపాల్‌ సర్కార్‌. రాజధాని ఖాట్మాండ్‌ లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. సాయంత్రం నాలుగున్నరకు ఖాట్మాండులో ల్యాండ్‌ కానున్న ఆయన..  షీటల్ నివాస్‌లో నేపాల్‌ అధ్యక్షుడు బిధ్య దేవి భండారితో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. అనంతరం జిన్‌ పింగ్‌ ప్రతిపక్ష నేత షేర్‌ బహదూర్‌ తో భేటీ కానున్నారు.