ఆధ్యాత్మిక బాట పట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. కేదార్ నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల సందర్శను చెన్నై నుంచి డెహ్రాడూన్ చేరుకున్న రజనీకాంత్ అక్కడి నుంచి కారులో పుణ్యక్షేత్రాలకు వెళ్లనున్నారు. మార్గమధ్యలో రిషికేష్ లోని దయానంద ఆశ్రమంలో కాసేపు గడిపారు రజనీకాంత్. తర్వాత తాను ప్రత్యక్ష దైవంగా భావించే బాబా గుహకు వెళ్లి ధ్యానం చేసి, తిరిగి చెన్నై చేరుకుంటారని తెలుస్తోంది. ఆ తరువాతే షూటింగ్ పూర్తయిన దర్బార్ సినిమాకు.. డబ్బింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో రజనీ పాల్గొంటారని సమాచారం.