చంద్రయాన్-2 కు చెందిన కీలక ఫోటోలు

చంద్రయాన్‌-2కు సంబంధించిన కీలక ఫొటోలను నాసా విడుదల చేసింది. నాసాకు చెందిన లునార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా ఎల్‌ఆర్‌వోసీ ఈ ఫొటోలను తీసినట్టు నాసా తెలిపింది. చంద్రయాన్‌-2 నుంచి వేరయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్‌ ఫొటోలను నాసా విడుదల చేసింది. విక్రమ్‌ ల్యాండ్‌ కావాల్సిన నిర్ధారిత ప్రదేశాన్ని ఎల్‌ఆర్‌వోసీ తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై 150 కిలోమీటర్ల పరిధిమేర చిత్రించింది. అయితే, విక్రమ్‌ కచ్చితంగా ఎక్కడ హార్డ్‌ ల్యాండ్‌ చేసిందనేది ఇంకా గుర్తించాల్సి ఉందని నాసా తెలిపింది.