ఇకపై తెలుగులో కూడా ‘గూగుల్ అసిస్టెంట్‌’

గూగుల్‌ అసిస్టెంట్‌ ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఒకే గూగుల్‌ అని చెప్పగానే యాక్టివేట్ అయిపోయే.. గూగుల్ అసిస్టెంట్‌.. ఇంగ్లీష్ లోనే కాకుండా త్వరలో భారత్‌ లో తెలుగు, హిందీ సహా మరో 7 భాషాల్లో అందుబాటులోకి అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్‌ యూజర్లు.. గూగుల్‌ అసిస్టెంట్‌ తో మాట్లాడాలనుకుంటే.. వారు ఎంచుకున్న భాషను బట్టి.. ఒకే గూగుల్‌ అని వారి భాషలో చెప్పాలి. ఉదాహరణకు.. తెలుగులో అయితే సఒకే గూగుల్‌ టాక్‌ టు మీ ఇన్‌ తెలుగు’ అని గానీ లేదా ‘హేయ్‌ గూగుల్‌ తెలుగులో మాట్లాడు’ అని చెప్పినా సరిపోతుంది. హిందీలో అయితే..’ఓకే గూగుల్ హిందీ బోలో’ అని గానీ..’టాక్ టూ మీ ఇన్ హిందీ’ అని గాని చెప్పగానే యాక్టివ్‌ అయిపోతుంది. గూగుల్ అసిస్టెంట్‌ ను వారి వారి భాషలకు తగ్గుట్లుగా ఆధునీకరించినట్లు గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మాన్యుల్ బ్రాన్ స్టీన్ వెల్లడించారు. కొత్త భాషలు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ గో, కియో పరికారల్లో అందుబాటులోకి వస్తున్నాయని బ్రాన్ స్టీన్ పేర్కొన్నారు. ఒక భాషలోంచి ఇంకో భాషకు ట్రాన్స్‌లేట్ చేయగల గూగుల్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.