‘ఖేల్‌ రత్న’కు బజ్‌ రంగ్‌ నామినేట్‌   

ప్రముఖ రెజ్లర్‌ బజ్‌ రంగ్‌ పూనియా అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్నకు నామినేట్‌ అయ్యాడు. జస్టిస్‌ ముకుందకం శర్మ నేతృత్వంలోని 12 మంది సభ్యులతో కూడిన అవార్డుల కమిటీ పూనియా పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసింది.   ఆసియా, కామన్వెల్త్‌ గేమ్స్‌ లో స్వర్ణాలు సాధించినప్పటికీ గతేడాది ఖేల్‌ రత్న కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోర్టుకి వెళ్తానని బజ్‌ రంగ్‌ హెచ్చరించాడు. ఈసారి అతడి కోరిక నెరవేరింది.