కేంద్రమంత్రి కారుపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్‌ లో సేమ్‌ సీన్‌ రిపీట్ అయింది. మూడో విడతలో జరిగిన ఆందోళనలు.. నాలుగో విడతలోనూ పునరావృతం అయ్యాయి. అసన్‌ సోల్ లో కేంద్రమంత్రి అసన్సోల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్‌ సుప్రియో కారుపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి ఆయనను రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులపై కూడా దాడికి దిగారు టీఎంసీ కార్యకర్తలు. ఓటర్ల చైతన్యాన్ని చూసి మమతా బెనర్జీ భయపడుతోందని ఆరోపించారు బాబుల్‌ సుప్రియో. అందుకే కార్యకర్తలతో దాడులు చేపిస్తున్నారని మండిపడ్డారు.