F2 ఐదు డిలిటెడ్ సీన్లు

విక్టరీ వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌ గా తెరకెక్కిన చిత్రం ‘F2’ నుండి డిలిటెడ్‌ సీన్లు విడుదల చేశారు నిర్మాత దిల్‌రాజు. చిత్రంలో నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా తొలగించిన ఐదు సీన్లను దిల్‌రాజు తన యూట్యూబ్‌ లో ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఐదింటిని విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘f2’ సినిమాను అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించారు. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ చిత్రానికి మునుపెన్నడూ రానన్ని వసూళ్లను రాబట్టింది ఎఫ్‌2 చిత్రం. వెంకటేశ్ కామెడీకి వరుణ్‌ తేజ్‌ తెలంగాణ భాషను జోడించడంతో థియేటర్లలో నవ్వుల పండించారు.

ఎఫ్2 లో తొలగించిన వీడియోలు అన్నీ యూట్యూబ్‌ లో చక్కటి స్పందన వచ్చింది. అన్ని వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. లక్షల మంది వీడియోలను చూశారు. ఓ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.140 కోట్లు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే షూటింగ్‌ పూర్తైన రోజే డైరెక్టర్‌ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సీక్వెల్‌ గా F3 చేద్దామని వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ను అడగ్గా.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పారు.