ఎఫ్-16 పై పాక్ వివరణ ఇవ్వాల్సిందే: ట్రంప్

భారత సైనిక స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేయడాన్ని తప్పుబట్టింది అమెరికా అగ్రరాజ్యం. ఉగ్రవాద స్థావరాలపైనే ఎఫ్-16 యుద్ధ విమానాలను ప్రయోగిస్తామన్న పాక్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీన్నితప్పు బట్టిన అమెరికా.. పాక్‌ను వివరణ కోరింది. ఎఫ్‌–16 విమానాలను పాకిస్థాన్ బయట ఉపయోగించాలన్నా.. సైనిక విన్యాసాల్లో వినియోగించాలన్నా, మూడో దేశంపై ప్రయోగించాలన్నా ముందుగా అమెరికా అనుమతి తీసుకోవాలి. కానీ అవేవి లేకుండానే ఇమ్రాన్‌ సర్కార్‌ అత్యూత్సాహం ప్రదర్శించడంపై గుర్రుగా ఉన్నారు ట్రంప్‌. దీనికి కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని పాక్ కు ట్రంప్ ఆదేశించారు.