సిరీస్‌ చేజార్చుకున్న భారత మహిళల జట్టు

2-0తో సిరీస్ కివీస్ కైవసం

న్యూజిలాండ్ మహిళలతో జరిగిన రెండో టీ-20లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది.  నాలుగు వికెట్ల తేడాతో కివీస్ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. రోడ్రిగ్వెస్ హాఫ్ సెంచరీ చేయగా..ఆమెకు స్మృతి మందానా 36 పరుగులు చేసి సహరించింది. ఆ తర్వాత 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆతిధ్య జట్టు.. సరిగ్గా 6 వికెట్లు కోల్పోయి చివరి బంతితో లక్ష్యాన్ని చేధించింది. సుజీ బేట్స్ 62 పరుగులు సాధించగా… సెటర్త్ వేట్ 23 పరుగులతో రాణించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకుంది.