మన గురుకులాలు దేశానికే ఆదర్శం

తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శమన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన 4వ ఇంటర్ సొసైటీ లీగ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ సంక్షేమం) ఏకే ఖాన్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.