విరాట్‌ కోహ్లీ హ్యాట్రిక్‌ రికార్డులు.. వీడియో

Virat-kohli
India Captain Virat Kohli

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మూడు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా పదో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర వన్డేల్లో వరుసగా నాలుగు సెంచరీల రికార్డుతో టాప్‌లో కొనసాగుతున్నాడు.